Bharat Biotech Covaxin: భారత్ బయోటెక్ 'కొవాక్జిన్‌' కు మరో అనుమతి..

Bharat Biotech Covaxin: భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవాక్జిన్‌ ను చర్మం కింద పొరలో ఇచ్చేలా ట్రయల్స్‌ చేపట్టేందుకు ప్రభుత్వ ప్యానల్ అంగీకరించింది.

Update: 2020-08-23 01:12 GMT

Bharat Biotech Covaxin

Bharat Biotech Covaxin: భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవాక్జిన్‌ ను చర్మం కింద పొరలో ఇచ్చేలా ట్రయల్స్‌ చేపట్టేందుకు ప్రభుత్వ ప్యానల్ అంగీకరించింది. దీనినే 'ఇంట్రాడెర్మల్‌ రూట్' అంటారు. చర్మం కింది పొరలైతే తక్కువ వాక్సిన్ ఇచ్చినా సరిపోతుంది.. అందుకే ఈ మార్గం ద్వారా క్లినికల్ ట్రయల్స్‌ చేపడుతున్నట్లు తెలుస్తోంది..కాగా, భారత్ బయోటెక్ త్వరలో మూడవ దశ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. అంతే కాదు, సాదారణంగా చికిత్స చేసేందుకు టీకాను అనేక మార్గాలలో ఇస్తుంటారు.

ముఖ్యంగా భుజాలు, పిరుదులకు టీకా ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. దీనిని ఇంట్రామస్కులర్‌ రూట్‌ అంటారు. కొన్ని టీకాలు సెలైన్‌ ద్వారా, నోటి ద్వారా, లేదా నరాల ద్వారా ఇస్తారు. అదేవిదంగా కొన్ని టీకాలను చర్మం కింద ఉన్న పొరకు ఇస్తారు. చర్మం కింద పొరకు టీకా ఇవ్వడానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే కండరాలకు ఎక్కువ ఔషధాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.

ఇక దేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 29 లక్షల 75 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 69,878 కేసులు నమోదు కాగా, 945 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 63,631 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 29,75,701 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,97,330 ఉండగా, 22,22,577 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 55,794 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 74.30 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.89 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 23.82 శాతంగా ఉంది. గడచిన 24 గంటల్లో దేశంలో 10,23,836 టెస్టులు జరిగాయి. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 3,44 91,073కి చేరింది.  

Tags:    

Similar News