Bhagwant Mann: నేడు పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ సింగ్ ప్రమాణం
Bhagwant Mann: నేడు పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ సింగ్ ప్రమాణం
నేడు పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ సింగ్ ప్రమాణం
Bhagwant Mann: ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ దేశంలో రెండో రాష్ట్రంలో పాలనా పగ్గాలను చేపట్టనుంది. ఇప్పటికే ఢిల్లీ పాలనా పగ్గాలను ఎప్పుడో తనచేతిలోకి తీసుకున్న ఆప్ తాజాగా ఇటీవల ముగిసిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పంజాబ్‌లో గ్రాండ్ విక్టరీని దక్కించుకుంది. ఆప్ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించిన భగవంత్ మాన్ సింగ్ ఇవాళ పంజాబ్ సీఎంగా పదవీ ప్రమాణం చేయనున్నారు. ఇందుకోసం ఖత్కర్ కలాన్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.