భగత్ సింగ్ స్వగ్రామంలో సీఎం ప్రమాణం.. పంజాబ్ కొత్త సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
Bhagwant Mann: పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయంతో సంచలనం సృష్టించింది.
భగత్ సింగ్ స్వగ్రామంలో సీఎం ప్రమాణం.. పంజాబ్ కొత్త సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
Bhagwant Mann: పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయంతో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారాన్ని రాజ్‌భవన్‌లో చేయనని తెలిపారు. భగత్‌సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్‌కలన్‌లో తాను పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని భగవంత్ మన్ స్పష్టం చేశారు. ధురిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన మన ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటోలకు బదులు భగత్‌సింగ్, అంబేద్కర్ ఫొటోలు పెట్టుకోవచ్చని చెప్పారు. దీంతో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు భగవంత్‌సింగ్ మాన్‌కు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.