ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ గుండెపోటుతో మృతి

Update: 2020-02-18 03:58 GMT

ప్రముఖ బెంగాలీ నటుడు, మాజీ ఎంపీ తపస్‌ పాల్‌(61) గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు తపస్‌ పాల్‌ ఈ ఉదయం నాలుగు గంటలకు కన్నుమూసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. తపస్పాల్‌కు భార్య నందిని, కుమార్తె సోహిని పాల్ ఉన్నారు. సోమవారం తపస్‌పాల్‌ తన కుమార్తెను చూడటానికి ముంబై వెళ్లి తిరిగి విమానంలో కొల్‌కతాకు వచ్చేటప్పుడు.. విమానాశ్రయంలో ఛాతిలో నొప్పి వస్తోందని సిబ్బందికి తెలిపారు. దీంతో ఆయనను జుహులోని ఆస్పత్రికి తరలించారు. కానీ దురదృష్టవ శాత్తు తపస్‌ పాల్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. గతంలో కూడా తపస్‌పాల్‌ పలుమార్లు ఆస్పత్రి పాలయ్యారు. కొన్ని రోజులుగా అయన గుండె జబ్బుకు చికిత్స తీసుకుంటున్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని చందన్నగర్‌లో జన్మించిన తపస్ పాల్ బయో సైన్స్‌లోని హూగ్లీ మొహ్సిన్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.1980 లో తపస్ పాల్ బెంగాలీ చిత్ర పరిశ్రమలో తరుణ్‌ మజుందార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన దాదర్‌ కీర్తి సినిమాతో బెంగాలీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో మహువా రాయ్‌చౌదరి, దేబాశ్రీ రాయ్ మరియు సంధ్య రాయ్ లతో కలిసి నటించారు. దేబాశ్రీ రాయ్‌తో, తపస్ పాల్ నిశాంతే, సంప్తి, చోఖేర్ అలోయ్ సహా పలు చిత్రాల్లో నటించారు.

తన మొదటి చిత్రం నాలుగు సంవత్సరాల తరువాత, తపస్ పాల్ 1984 లో అబోద్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టారు.. మాధురి దీక్షిత్ సరసన నటించారు. హిరెన్ నాగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలో మాధురిని తొలిసారిగా గుర్తించింది. మూడు దశాబ్దాలుగా తన కెరీర్‌లో, తపస్ పాల్ ప్రోసెంజిత్ ఛటర్జీ, సౌమిత్రా ఛటర్జీ, రాఖీతో పాటు మౌసుమి ఛటర్జీ వంటి సహా నటులతో కలిసి పనిచేశారు. తపస్ పాల్ చివరిసారిగా 2013 యొక్క ఖిలాడిలో కనిపించారు. సినిమాల్లోనే కాకుండా తపస్‌పాల్‌ రాజకీయాల్లో కూడా రాణించారు. ఆయన తృణముల్‌ కాంగ్రెస్‌ తరుపున లోక్ సభ సభ్యునిగా గెలిచి సుదీర్ఘకాలం పాటు ఆ పార్టీలో కొనసాగారు.

Tags:    

Similar News