Nirbhaya Case: నిర్భయ నిందితుల ఉరి ఉంటుందా? వాయిదా పడుతుందా?

నిర్భయ సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో కొత్త మలుపు తిరిగింది, నలుగురు దోషుల తరఫు న్యాయవాది ఎపి సింగ్ బుధవారం డెత్ వారెంట్ ఉరిశిక్షను నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ లోని పాటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించారు.

Update: 2020-03-19 03:02 GMT
Nirbhaya convicts (File Photo)

నిర్భయ సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో కొత్త మలుపు తిరిగింది, నలుగురు దోషుల తరఫు న్యాయవాది ఎపి సింగ్ బుధవారం డెత్ వారెంట్ ఉరిశిక్షను నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ లోని పాటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించారు. నలుగురు నిందితుల ఉరిశిక్షకు రెండు రోజుల సమయం ఉండటంతో, వారి న్యాయవాది తాను సుప్రీంకోర్టులో దోషి పవన్ గుప్తా తరపున క్యూరేటివ్ పిటిషన్, అక్షయ్ సింగ్ తరపున క్షమాబిక్ష పిటిషన్ దాఖలు చేశానని పేర్కొన్నారు. పవన్ గుప్తా తరఫున దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్, సంఘటన సమయంలో అతను మైనర్ అని పేర్కొన్నాడు.

ఇదిలాఉండగా, మరో దోషి అక్షయ్ కుమార్ సింగ్ మంగళవారం అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ కు రెండవ సారి క్షమాబిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. అయితే ఈ పిటిషన్ పరిశీలన ఆలస్యం జరగదని తీహార్ జైలు సీనియర్ అధికారులు తెలుపుతున్నారు.

అంతకుముందు అక్షయ్ కుమార్ సింగ్ యొక్క మొదటి క్షమాబిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రద్దు చేశారు. కాగా నలుగురు మరణశిక్ష శిక్షకులలో ఒకరైన ముఖేష్ సింగ్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు రిజర్వు చేసింది. మరోవైపు నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ భార్య పునీత విడాకులు కావాలంటూ పిటిషన్‌ను తెరపైకి తీసుకువచ్చారు. ఈ మేరకు మంగళవారం రోజున ఔరంగాబాద్ ప్యామిలీ కోర్టులో విడాకుల కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. 'అత్యాచారం కేసులో నా భర్తను దోషిగా తేల్చి అతనికి ఉరిశిక్ష విధించారు. కానీ నా భర్త నిర్దోషి. రేప్ కేసులో ఉరితీసిన దోషి భార్యగా నేను ఉండాలనుకోవడం లేదు' అంటూ పేర్కొన్నారు. ఈ పిటిషన్ కూడా ఇవాళ విచారణకు వస్తోంది.

కాగా ఇప్పటికే మూడుసార్లు వీరికి ఉరి శిక్షను వివిధ కారణాల రీత్యా వాయిదా వేశారు. అయితే రేపు నలుగురు నిందితులను ఉరి తీయమని ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్ట్ డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో మరోసారి నిందితులు కోర్టుల్లో పిటిషన్లు రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటిషన్లు దాఖలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఉరి శిక్ష నుంచి తప్పించుకునేందుకే నిందితులు ఒకరి తరువాత ఒకరు ఇలా డ్రామాలు ఆడుస్తున్నారన్న విషయం అర్ధమైపోతోంది. ఇవన్నీ పక్కనబెడితే ఎప్పటిలాగే వీరి పిటిషన్లు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయని ఉరి ఆపేస్తారో లేక అమలు చేస్తారో ఇవాళే తేలిపోనుంది.


Tags:    

Similar News