Batla House Encounter Case: బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో దోషికి ఉరిశిక్ష

Batla House Encounter Case: బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో దోషికి ఉరిశిక్ష ఖారారైంది.

Update: 2021-03-15 14:58 GMT

బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో దోషికి ఉరిశిక్ష

Batla House Encounter Case: బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో దోషికి ఉరిశిక్ష ఖారారైంది. దోషి అరిజ్‌ ఖాన్‌కు ఢిల్లీ కోర్టు ఈశిక్షను విధించింది. అరిజ్ ఖాన్‌ ఇండియన్‌ ముజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాది కాగా 2008 ఎన్‌కౌంటర్‌లో ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌చంద్‌ శర్మ మరణించారు. 12 ఏళ్ల క్రితం దేశంలో బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌ సంచలనం సృష్టించింది.

దేశంలో 12ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. కేసులో ప్రధాన దోషి, ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన అరిజ్‌ ఖాన్‌కు ఉరిశిక్ష విధించింది. అలాగే 11లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది.

2008 ఢిల్లీలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఇక ఇండియా గేట్‌ దగ్గర బాంబు పేలుళ్లకు తెగబడిన ఉగ్రవాదులు జామియా నగర్‌లోని ఎల్‌-18 బాట్లా హౌస్‌లో దాక్కున్నట్టు ఇంటెలిజెన్స్‌ నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగన పోలీసుల బృందం అక్కడికి బయల్దేరి వెళ్లింది. ఆ సమయంలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌ చంద్‌ శర్మకు బుల్లెట్‌ తగలడంతో వీరమరణం పొందారు.

Tags:    

Similar News