Bank Strike News: సమ్మె బాట పట్టనున్న బ్యాంక్ ఉద్యోగులు
Bank Strike News: బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లుకు వ్యతిరేకంగా సమ్మె
సమ్మె బాట పట్టనున్న బ్యాంక్ ఉద్యోగులు
Bank Strike News: బ్యాంక్ ఉద్యోగులు సమ్మెబాట పట్టనున్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో యూనియన్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది. జాతీయ స్థాయిలో ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ లు ఈ బంద్ లో పాల్గొననున్నాయి. బ్యాంక్ ఉద్యోగు సమ్మెతో ఏటీఎం కార్యకలాపాలకు కూడా అంతరాయం ఏర్పడనుంది. ఖాతాదారులు ముందస్తుగానే అవసరానికి కావాల్సిన డబ్బులు డ్రా చేసుకోవాలని బ్యాంక్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.