Bank Holiday: ఆగస్టులో 15 రోజుల బ్యాంకు సెలవులు – పూర్తి వివరాలు
ఆగస్టులో బ్యాంకులు మొత్తం 15 రోజులు మూతపడనున్నాయి. ఆర్బీఐ విడుదల చేసిన బ్యాంకు సెలవుల జాబితాలో పండుగలు, రెండవ-నాలుగో శనివారాలు, ఆదివారాలు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా పూర్తి వివరాలు తెలుసుకోండి.
Bank Holiday: ఆగస్టులో 15 రోజుల బ్యాంకు సెలవులు – పూర్తి వివరాలు
దేశవ్యాప్తంగా ఆగస్టు నెలలో బ్యాంకులు మొత్తం 15 రోజులపాటు మూతబడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతీ ఏడాది విడుదల చేసే బ్యాంక్ హాలిడే లిస్ట్ ప్రకారం, ఈ సెలవుల్లో పండుగలు, రెండో మరియు నాల్గో శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. అయితే, కొన్ని సెలవులు దేశవ్యాప్తంగా వర్తించగా, మరికొన్ని కేవలం ఆయా రాష్ట్రాలకే పరిమితం అవుతాయని బ్యాంక్ కస్టమర్లు గమనించాలి.
ఆగస్టు నెల బ్యాంక్ హాలిడే లిస్ట్
ఆగస్టు 3 – కేర్ పూజ (త్రిపుర)
ఆగస్టు 8 – రమ్ ఫట్ (సిక్కిం, ఒడిశా)
ఆగస్టు 9 – రక్షా బంధన్ (ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్)
ఆగస్టు 13 – దేశభక్తి దినోత్సవం (మణిపూర్)
ఆగస్టు 15 – స్వాతంత్ర్య దినోత్సవం (దేశవ్యాప్తంగా)
ఆగస్టు 16 – జన్మాష్టమి, పార్సీ నూతన సంవత్సరం (గుజరాత్, మహారాష్ట్ర)
ఆగస్టు 26 – గణేష్ చతుర్థి (కర్ణాటక, కేరళ)
ఆగస్టు 27 – గణేష్ చతుర్థి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా, సిక్కిం)
ఆగస్టు 28 – నువాఖై (ఒడిశా, పంజాబ్, సిక్కిం)
సప్తాహాంత సెలవులు
శనివారాలు – ఆగస్టు 9 (రెండవ శనివారం), ఆగస్టు 23 (నాల్గవ శనివారం)
ఆదివారాలు – ఆగస్టు 10, 17, 24, 31
మొత్తం 15 రోజులపాటు బ్యాంకులు మూతపడతాయి కాబట్టి, కస్టమర్లు ముందుగానే తమ బ్యాంకింగ్ పనులను పూర్తి చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.