Ayodhya: రేపే అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట.. ప్రాణ ప్రతిష్ట క్రతువులో పాల్గొననున్న 14 మంది దంపతులు..

Ayodhya Ram Mandir Inauguration: బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య సిద్ధమైంది.

Update: 2024-01-21 13:15 GMT

Ayodhya: రేపే అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట.. ప్రాణ ప్రతిష్ట క్రతువులో పాల్గొననున్న 14 మంది దంపతులు..

Ayodhya Ram Mandir Inauguration: బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య సిద్ధమైంది. లక్షలాదిగా వస్తున్న భక్తులతో అయోధ్యలో పండుగ వాతావరణ నెలకొంది. రేపే అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. తెల్లవారు జాము నుంచే అయోధ్యలో పెద్దఎత్తున పూజలు ప్రారంభం కానున్నాయి. వేతపండితుల మంత్రోచ్ఛరణలతో ఇప్పటికే అయోధ్య పురవీధులు మారుమ్రోగుతున్నాయి. ప్రాణ ప్రతిష్ట క్రతువులో 14 మంది దంపతులు పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు దివ్య సుమూహూర్తంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది.

అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట వేడుకకు భారీ సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. రేపు ఉదయం 10 నుంచి మంగళ ధ్వని పేరిట సంగీత కార్యక్రమం జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు మంగళ ధ్వని కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి 50 మంది ప్రత్యేక వాయిద్యాకారులు తరలివచ్చారు. ఇక విమానాల్లో వచ్చే అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 100కి పైగా విమానాల్లో అతిథులు వస్తారని అంచనా వేస్తున్నారు. విమానాల పార్కింగ్‌ కోసం లక్నో, వారణాసి.. గోరఖ్‌పూర్‌, కాన్పూర్‌ ఎయిర్‌పోర్ట్‌ల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. 

Tags:    

Similar News