ఉద్యోగస్థులకు, పన్ను చెల్లింపుదారులకు నిర్మలా సీతారామన్ శుభవార్త!

Update: 2020-05-13 13:03 GMT
nirmala sitharaman press meet

ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా కేంద్ర ఆర్ధిక మంత్రి పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగస్తులకు తీపి కబురు అందించారు. ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే ఎంఎస్‌ఎంఈలకు మరో మూడు నెలలు భవిష్య నిధి (పీఎఫ్‌) ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. జూన్‌, జులై, ఆగస్టు నెలల పీఎఫ్‌ మొత్తం రూ.2500 కోట్లు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. ఉద్యోగులు నెలనెలా చెల్లించే ఈపీఎఫ్‌ను 12 శాతం నుంచి 10శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపారు. దీంతో ఉద్యోగస్తులకు ఊరట లభించినట్టే. వారికి చేతికి అందే జీతం కొంత ఎక్కువ కానుంది.

పన్ను చెల్లింపుదారులకోసం..

అదేవిధంగా ఈ ప్యాకేజీలో భాగంగా పన్ను చెల్లించే వారికి ఉపశమనం లభించనుంది. నిర్మలా సీతారామన్ చెప్పినదాని ప్రకారం.. ప్రస్తుతం చెల్లిస్తున్న టీడీఎస్‌, టీసీఎస్‌ను 25శాతం తగ్గిస్తున్నారు. ఈ తగ్గింపుతో ప్రజలకు రూ.50వేల కోట్ల మేర లబ్ధి జరగనుంది. ఈ తగ్గింపు రేపటి నుంచి 2021 మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. ఇక, రెరా పరిధిలోకి వచ్చే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు ఊరట కల్పించారు. రెరా నిబంధనల ప్రకారం భవన నిర్మాణాల పూర్తికి గడువు ఆరు నెలలు పొడిగిస్తున్నట్టు ఆర్ధిక మంత్రి ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోడీ నిన్న 20 లక్షల కోట్ల భారీ ఆర్ధిక ప్యాకేజీని ఆత్మా నిర్భార్ భారత్ పేరుతొ అందిస్తున్నట్టు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈరోజు (మే 13) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మొత్తం 15 అంశాలుగా ఈ ప్యాకేజీ ఉండబోతోందని వివరించారు. వాటిని ఒక్కో అంశంగా వెల్లడిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా కొన్ని వర్గాలకు ఊరటనిస్తూ ఈరోజు కొన్ని వివరాలు వెల్లడించారు ఆర్ధిక మంత్రి.

Tags:    

Similar News