అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పెళ్లి నిషేధం

Assam: అనుమతి లేకుండా రెండో పెళ్లి కుదరదు

Update: 2023-10-27 15:15 GMT

అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పెళ్లి నిషేధం 

Assam: అసోం ప్రభుత్వ ఉద్యోగులకు అక్కడి సర్కారు కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. అప్పటికే వివాహం చేసుకుని, జీవిత భాగస్వామి జీవించే ఉంటే రెండో వివాహం చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా బహుభార్యత్వం కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇద్దరు భార్యలు ఉంటే, ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు పెన్షన్ కు అర్హత విషయంలో వివాదాలు ఏర్పడుతున్నట్టు చెప్పారు.

Tags:    

Similar News