Lakhimpur Kheri: ఆశిష్ మిశ్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
Lakhimpur Kheri: లఖీంపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
Lakhimpur Kheri: ఆశిష్ మిశ్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
Lakhimpur Kheri: లఖీంపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న ఆశిష్ మిశ్రాకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు న్యాయమూర్తి. నిన్న దాదాపు 12 గంటలపాటు విచారించిన అనంతరం ఆశిష్‌ను అరెస్ట్ చేశారు. ఇవాళ కోర్టుకు సెలవు కావడంతో నిన్న రాత్రే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మరోవైపు ఆశిష్ మిశ్రాను పోలీసుల రిమాండ్‌కు అనుమతించాలని కోరుతూ న్యాయమూర్తికి అపీల్ చేసినట్లు ఎస్‌పీ యాదవ్ తెలిపారు. దీనిపై రేపు విచారణ జరగనుంది.