పాక్ ప్రధానిపై మరోసారి విరుచుకుపడ్డ అసదుద్దీన్... విమానాన్ని ఎక్కడ ల్యాండ్ చేస్తావంటూ ప్రశ్న..

Asaduddin Owaisi: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) మరియు ఆపరేషన్ సిందూర్ (Operation Sindhoor) అనంతరం పాకిస్థాన్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వరుసగా తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2025-05-13 10:45 GMT

పాక్ ప్రధానిపై మరోసారి విరుచుకుపడ్డ అసదుద్దీన్... విమానాన్ని ఎక్కడ ల్యాండ్ చేస్తావంటూ ప్రశ్న.

Asaduddin Owaisi: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) మరియు ఆపరేషన్ సిందూర్ (Operation Sindhoor) అనంతరం పాకిస్థాన్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వరుసగా తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) మరియు ఆర్మీ చీఫ్ మునీర్ (General Munir)లపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

'ఎక్స్' వేదికగా ఒవైసీ చేసిన తాజా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. “చైనా నుంచి అద్దెకు తెచ్చుకున్న విమానాన్ని పాకిస్థాన్ ప్రధానమంత్రి షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ తమ రహీమ్ యార్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ చేయగలరా?” అంటూ పాక్‌పై వ్యంగ్యంగా ప్రశ్నించారు.

ఎందుకంటే ఆ ఎయిర్‌బేస్ ఇటీవ‌ల‌ భార‌త్ చేసిన దాడుల్లో తీవ్రంగా ధ్వంస‌మైంది. ఈ నేప‌థ్యంలోనే పాక్‌ను ఎద్దేవా చేస్తూ ఆయ‌న ఈ ట్వీట్ చేశారు. దీనిపై 'ఎక్స్' యూజ‌ర్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 


Tags:    

Similar News