Arvind Kejriwal: కేజ్రీవాల్ బంపర్ ఆఫర్.. ఛాన్స్ ఇస్తారా..?
Arvind Kejriwal: ఇటీవల పంజాబ్ లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇపుడు హిమాచల్ ప్రదేశ్ పై ఫోకస్ పెట్టింది.
Arvind Kejriwal: కేజ్రీవాల్ బంపర్ ఆఫర్.. ఛాన్స్ ఇస్తారా..?
Arvind Kejriwal: ఇటీవల పంజాబ్ లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇపుడు హిమాచల్ ప్రదేశ్ పై ఫోకస్ పెట్టింది. ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీపై శంఖారావం మోగించారు. త్వరలో హిమాచల్ నుంచి అవినీతి బీజేపీ ప్రభుత్వాన్ని చీపురుతో తుడిచేస్తానని స్పష్టం చేశారు. ఢిల్లీ తరహా ప్రభుత్వ పథకాలను హిమాచల్ ప్రదేశ్ లో అమలు చేస్తామనీ భరోసా ఇచ్చారు.
ఢిల్లీలో 12 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. అలాగే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. తాను హిమాచల్ వస్తున్నానని తెలిసి.. బీజేపీ సర్కార్ 125 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామంటూ కాపీ వాగ్దానం చేసిందని సెటైర్ వేశారు. హిమాచల్ లో ఆప్ గెలిస్తే విద్య, వైద్యం, ఇతర మౌలిక వసతులను మెరుగు పరుస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.