Arvind Kejriwal: ఈడీ సమన్లపై ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్

Arvind Kejriwal: నేడు హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ

Update: 2024-03-20 01:46 GMT

Arvind Kejriwal: ఈడీ సమన్లపై ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్

Arvind Kejriwal: ఈడీ సమన్లను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు ఆప్ అధినేత కేజ్రీవాల్. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ కింద కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈడీ కేజ్రీవాల్‌‌కు ఎనిమిదిసార్లు సమన్లు పంపింది. ఆరుసార్లు కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో... దర్యాప్తు సంస్థ ఢిల్లీ కోర్టు మెట్లెక్కింది. కోర్టుకు హాజరైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

అయితే బెయిల్ మంజూరు చేసిన మరుసటి రోజే కేజ్రీవాల్‌కు తొమ్మిదోసారి సమన్లు పంపింది ఈడీ. మార్చి 21న తమ ఎదుట హాజరు కావాలని తెలిపింది. దీంతో కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఈకేసులో న్యాయపరమైన జోక్యం చేసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు. లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా పలువురు వ్యాపారులను అరెస్టు చేసింది.

Tags:    

Similar News