Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది.
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఈనెల 17న ఆయన వ్యక్తిగతంగా హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. లిక్కర్ పాలసీ కేసులో విచారణకు కేజ్రీవాల్ సహకరించట్లేదని ఈడీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.. ఈ నెల 17న కేజ్రీవాల్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో ఆమ్‌ఆద్మీపార్టీ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గత ఏడాది అరెస్టయి ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.