నేడు మోడీతో కేజ్రీవాల్‌ భేటి

ఢిల్లీ ముఖ్యమంత్రి, అమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ నేడు ప్రధాని మోడితో సమావేశం కానున్నారు. ఢిల్లీకి మూడోసారి ముఖ్యమంత్రి అయిన

Update: 2020-03-03 05:00 GMT
Arvind Kejriwal-Modi

ఢిల్లీ ముఖ్యమంత్రి, అమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ నేడు ప్రధాని మోడితో సమావేశం కానున్నారు. ఢిల్లీకి మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అరవింద్‌ కేజ్రీవాల్‌ మోడిని కలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.. ఉదయం 11 గంటలకు మోడీతో కేజ్రీవాల్‌ భేటి అవుతారు. ఇటీవల ఈశాన్య దిల్లీలో ఘర్షణల నేపధ్యంలో ఇరువురి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇక గత వారం, కేజ్రీవాల్ ఈ ఘర్షణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అమిత్ షా అన్ని సహాయం చేస్తానని హామీ ఇచ్చారని మేము రాజకీయాలను పక్కనబెట్టి కేంద్రం తరుపున అన్ని రకాల సహాయసహకారాలు చేసేందుకు సిద్దంగా ఉండడానికి నిర్ణయించుకున్నామని కేజ్రీవాల్ సమావేశం తరువాత చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఆయన కుటుంబం రెండు రోజుల భారత పర్యటనలో ఉన్న సమయంలో ఈ అల్లర్లు జరిగాయి.

ఈ అలర్లలలో 46 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. 1,200 మందికి పైగా అరెస్టు అయ్యారు. ఇక ఈ అల్లర్లులో చనిపోయినవారికి ఢిల్లీ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఇందులో మరణించిన వారికి వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు రూపాయలు, గాయపడిన వారికి రూ. 5 లక్షలు, చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, శాశ్వత వైకల్యం కలిగితే రూ. 5 లక్షలు, అనాథలుగా మిగిలిన వారికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వెల్లడించారు. అల్లర్లలో గాయపడిన మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరిన వారికి చికిత్స ఖర్చులను డీల్లీ ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. 

Tags:    

Similar News