Arvind Kejriwal: భారత్‌ను ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలన్నదే నా కల..
Arvind Kejriwal: భారత్‌ను ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలన్నదే నా కల..
Arvind Kejriwal: భారత్‌ను ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలన్నదే నా కల..
Arvind Kejriwal: గుజరాత్‌ను ఇన్నాళ్లు పాలించిన అవినీతి పార్టీలను సుదర్శన చక్రం అడ్డుకుంటుందని, రాబోయే ఎన్నికల్లో నిజాయితీ సర్కార్ కొలువుదీరుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా కేజ్రీవాల్ ఇవాళ ద్వారకాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఎన్నికల్లో ఒక పార్టీ మరో పార్టీని దుర్భాషలాడితే గుజరాత్ అభివృద్ధిలో మార్పు రాదని ఆయన చెప్పారు.
సమస్యలపై ఫోకస్ పెడితేనే అభివృద్ధి సాధ్యమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తనకు రాజకీయాలు చేయడం తెలియదన్నారు. భారత్‌ను ప్రపంచంలో నెంబర్ స్థానంలో నిలబెట్టాలన్నది తన కల అని చెప్పుకొచ్చారు కేజ్రీవాల్. దీనికి మాటలు చెబితే కుదరదన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం వంటి కనీస మౌలిక వసతులపై దృష్టి పెట్టాలన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో బోగస్ హామీలు గుప్పించే పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ చేసేదే చెబుతామని, చెప్పింది చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు.