Arvind Kejriwal: బీజేపీ టార్గెట్‌గా ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ విమర్శనాస్త్రాలు
Arvind Kejriwal: జైలు నుంచి బయటకు వచ్చి.. సీఎం పదవికి రిజైన్ చేసిన తర్వాత పొలిటికల్‌గా మరింత దూకుడు పెంచారు కేజ్రీవాల్.
Arvind Kejriwal: బీజేపీ టార్గెట్‌గా ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ విమర్శనాస్త్రాలు
Arvind Kejriwal: జైలు నుంచి బయటకు వచ్చి సీఎం పదవికి రిజైన్ చేసిన తర్వాత పొలిటికల్‌గా మరింత దూకుడు పెంచారు అరవింద్ కేజ్రీవాల్. తాజాగా బీజేపీ టార్గెట్‌గా మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారాయన. గత 10 ఏళ్లలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్డంపెట్టుకుని డిల్లీలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ఆపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
పంజాబ్‌లో ఆప్ విజయం సాధించాక.. డిల్లీలో పనులు ఆపకపోతే.. దేశవ్యాప్తంగా ఆప్ అధికారంలోకి వస్తుందని బీజేపీ నేతలు భయపడుతున్నారన్నారు. తాను జైల్లో ఉండగా ఢిల్లీ అభివృద్ధి పనులు ఆపేశారని...తిరిగి జైలు నుంచి వచ్చాక తమ పార్టీ వాటిని ప్రారంభించిందని కేజ్రీవాల్ తెలిపారు.