Kashmir Kulgam Encounter: జమ్మూ కశ్మీర్‌ కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్..ఓ ఉగ్రవాది మృతి, ఆర్మీ జవాన్‌కు గాయాలు

Kashmir Kulgam Encounter: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

Update: 2025-09-08 06:41 GMT

Kashmir Kulgam Encounter: జమ్మూ కశ్మీర్‌ కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్..ఓ ఉగ్రవాది మృతి, ఆర్మీ జవాన్‌కు గాయాలు

Kashmir Kulgam Encounter: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. జమ్మూ కశ్మీర్ కుల్గాం జిల్లా మరోసారి పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లింది. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఉదయం నుంచి ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మరణించగా, భారత జవాన్ గాయపడ్డాడు. కుల్గాం జిల్లాలోని గుడ్డర్ అడవి ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి.

ఈ సెర్చ్ ఆపరేషన్ ఒక్కసారిగా ఎన్‌కౌంటర్‌గా మారిపోయింది. ఈ విషయాన్ని కాశ్మీర్ జోన్ పోలీసులు X పోస్ట్‌ చేశారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఎస్‌ఓజీ, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఇదే సమయంలో జమ్మూ ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద మరో ఘటన చోటు చేసుకుంది. నిన్నరాత్రి 9 గంటలకు బీఎస్‌ఎఫ్ జవాన్లు ఒక చొరబాటుదారుడిని గుర్తించారు. అతను పాకిస్తాన్ పంజాబ్ వ్యక్తిగా గుర్తించారు. మరిన్ని వివరాల కోసం బీఎస్‌ఎఫ్ జవాన్లు అతని విచారిస్తున్నారు.


Tags:    

Similar News