చైనా, పాక్ కు ఆర్మీ చీఫ్ మరోసారి ఘాటు హెచ్చరికలు
74th Army Day: భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఎం.ఎం.నరవణె చైనా, పాక్ కు మరోసారి గట్టి హెచ్చరిక చేశారు.
చైనా, పాక్ కు ఆర్మీ చీఫ్ మరోసారి ఘాటు హెచ్చరికలు
74th Army Day: భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఎం.ఎం.నరవణె చైనా, పాక్ కు మరోసారి గట్టి హెచ్చరిక చేశారు. సరిహద్దుల్లో యధాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ఎత్తుల్ని ఎదుర్కొనేందుకు భారత సైన్య సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఢిల్లీలో శనివారం జరిగిన ఆర్మీ డే పరేడ్ లో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పటిష్ట ప్రణాళికలు రెడీ చేశామన్నారు.
ఇతర దేశాల నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా ప్రతి స్పందన చాలా వేగంగా ఉంటుందని నరవణె చెప్పారు. ఏటా జనవరి 15న జాతీయ సైనిక దినోత్సవాన్ని జరుపుకొంటారు. 1949లో బ్రిటిష్ వారి నుంచి భారత సైన్యం కమాండర్ ఇన్ చీఫ్‌గా ఫీల్డ్ మార్షల్ కె.ఎం.కరియప్పా బాధ్యతలు స్వీకరించినందుకు గుర్తుగా ఈరోజును జరపుకొంటున్నారు.