యువతను వెంటాడుతున్న గుండెపోటు.. కళ్లముందే కుప్పకూలుతున్నారు.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనే సమస్యలంటూ ప్రచారం..!

గుండె పోటు మరణాలకు సమాధానం చెప్పలేకపోతున్నారా?

Update: 2023-03-04 13:00 GMT

యువతను వెంటాడుతున్న గుండెపోటు.. అంతా కుర్రవాళ్లే.. కళ్లముందే కుప్పకూలుతున్నారు.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనే సమస్యలంటూ ప్రచారం..!

Heart Attack: అప్పటి వరకు డ్యాన్స్ చేస్తున్న కుర్రాడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్కూల్లో పిల్లలకు పాఠాలు చెబుతున్న టీచర్ గుండె ఉన్న ఫలాన ఆగిపోయింది. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎన్నో చూస్తున్నాం. అసలెందుకు ఈ గుండెకోత..? పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వాళ్లు కూడా హార్ట్ అటాక్ కు గురవుతున్నారు. గత రెండేళ్లలో నిత్యం ఇలాంటి ఘటనలే.. ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే మరీ ఎక్కువ. ఒక ఘటన మరువకముందే... మరో ఘటన. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది హార్ట్ స్ట్రోక్‌తో మరణిస్తున్నారు. కరోనా తర్వాతే దీని ప్రభావం ఎక్కువైంది. కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లు తీసుకున్న వారిలోనే అధికంగా ఈ సమస్యలు తలెత్తుతున్నాయా..? మరి దీనికి కోవిడ్ డోస్ తీసుకోవడమే కారణమా?

ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ వైరస్‌కు.. చెక్ పెట్టేందుకు అన్ని దేశాలు శతవిధాలా ప్రయత్నించాయి. భారత్ కూడా వ్యాక్సిన్ తెచ్చేందుకు చాలా కష్టపడింది. మొత్తానికి అనుకున్న సమయం కంటే తొందరగానే కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకొచ్చారు. అక్కడికి కోవిడ్ గండం గట్టెక్కింది. మరీ దాని తర్వాత జరిగే పరిణామాలను అంచనా వేశారా? వ్యాక్సిన్‌ను తీసుకురావాలనే ఆర్భాటంలో.. దాని సామర్థ్యాన్ని, భవిష్యత్తులో తలెత్తే పరిస్థితులను పట్టించుకోలేదన్న విమర్శలూ వస్తున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి మరీ కోవిడ్ వ్యాక్సిన్‌పై ప్రచారం చేశాయి. ఇప్పుడు అదే వ్యాక్సిన్ కారణంగా ప్రాణాలు పోతున్నాయని ప్రచారం జరుగుతోంది. వ్యాక్సిన్‌పై విపరీత ప్రచారాలు చేసిన ప్రభుత్వాలు.. ఇప్పుడు భారీగా పెరిగిన గుండె పోటు మరణాలపై ఎలా స్పందిస్తాయో చూడాలి.

Tags:    

Similar News