Meloni-Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడి వైపు మెలోనీ సీరియస్ లుక్ వీడియో వైరల్
మోడీకి ఘనస్వాగతం పలికిన ఇటలీ ప్రధాని మెలోనీ
Meloni-Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడి వైపు మెలోనీ సీరియస్ లుక్ వీడియో వైరల్
G7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు.. ఇటలీ వెళ్లిన ప్రధాని మోడీ మరోసారి నెట్టింట్లో వైరల్‌గా మారారు. ఆ మధ్య మోడీతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సెల్ఫీ దిగారు. ‘మెలోడీ పేరుతో ఆ ఫొటో అప్పట్లో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. తాజాగా ఇటలీ వెళ్లిన మోడీకి.. ఇటలీ ప్రధాని మెలోనీ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మోడీతో సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అనంతరం ఆ వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు మెలోనీ. ‘హాయ్ ఫ్రెండ్స్, ఫ్రమ్ మెలోడీ’ అని క్యాప్షన్ ఇచ్చారు.