అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు పప్పాల్‌ప్రీత్ సింగ్ అరెస్ట్
* హోషియార్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు పప్పాల్‌ప్రీత్ సింగ్ అరెస్ట్
Punjab: ఖలీస్తానీ నేత, వార్సీ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు పప్పాల్‌ప్రీత్ సింగ్ ను పంజాబ్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్టు చేశారు. హోషియార్‌పూర్‌లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో జలంధర్ నుంచి పరారీ అయ్యాడు.. అమృత్‌పాల్‌తో పాటు పప్పాల్‌సింగ్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. పంజాబ్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అతను చిక్కాడు. ఏప్రిల్ 14వ తేదీన బైసాకి సందర్భంగా సిక్కు సమ్మేళనం కోసం అమృత్‌పాల్ సింగ్ పిలుపునిచ్చాడు. అమృత్ పాల్‌ను పట్టుకునేందుకు ఆ రాష్ట్రంలో పోలీసులకు సెలవులను రద్దు చేశారు.