Amit Shah: ఇవాళ హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Amit Shah: రేపు ఉదయం డైరెక్టర్ రాజమౌళితో మర్యాదపూర్వక భేటీ
Amit Shah: ఇవాళ హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం రాత్రికి హైదరాబాద్ రానున్నారు. శంషాబాద్ నోవాటేల్ హోటల్ లో ఆయన బస చేయనున్నారు. గురువారం ఉదయం ప్రముఖ సినిమా డైరెక్టర్ రాజమౌళితో షా మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ప్రతి పర్యటనలో అమిత్ షా పలువురు ప్రముఖులతో భేటీ అవుతున్నారు. అందులో భాగంగానే పార్టీ ప్రముఖులతో భేటీ అయ్యి కీలక అంశాలపై చర్చించనున్నారు. లంచ్ తర్వాత ప్రత్యేక హెలికాఫ్టర్ లో భద్రాచలం వెళ్లి అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత సాయంత్రం ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు.