జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్న అమిత్‌.. శ్రీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో అభివృద్ధిపనులకు శ్రీకారం

Amit Shah: శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి అమిత్‌షా

Update: 2022-10-06 02:35 GMT

జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్న అమిత్‌.. శ్రీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో అభివృద్ధిపనులకు శ్రీకారం

Amit Shah: జమ్మూకశ్మీర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా సహకరిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. శ్రీనగర్‌ లో జరిగిన కార్యక్రమంలో అమిత్‌షా అభివృద్ధికార్యక్రమాలకు డిజిటల్ శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. జమ్మూకశ్మీర్‌ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అమిత్‌షా విపక్షాలపై నిప్పులు చెరిగారు. జమ్ము కశ్మీర్‌ను దేశంలోనే శాంతియుత ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్ని గ్రామాలకు విద్యుత్‌ సదుపాయం ఉందని అమిత్‌ షా అక్కడున్న వారిని ప్రశ్నించారు.

గత మూడేళ్లలో కశ్మీర్‌లోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ అందించామని చెప్పారు. అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన ఉగ్రవాదాన్ని రూపు మాపేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. జమ్ముకశ్మీర్‌ అభివృద్ధిలో వెనకబడిపోవడానికి అబ్దుల్లా ,నేషనల్‌ కాన్ఫరెన్స్‌ , ముఫ్తీ ,పీడీపీ , నెహ్రూ-గాంధీ ,కాంగ్రెస్ కుటుంబాలే కారణమని మండిపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉమ్మడి జమ్ముకశ్మీర్‌ను ఈ మూడు కుటుంబాలే ఎక్కువ కాలం పాలించాయన్నారు. ఆ మూడు పార్టీలు అవినీతిలో మునిగిపోయాయని మండిపడ్డారు. వారికి పరిపాలన చేతకాక, అభివృద్ధి లేమితో వెనకబడిపోయిన దేశాన్ని మోదీ ప్రగతి పథంలో నడిపిస్తున్నారని ప్రస్తావించారు.

Tags:    

Similar News