Amit Shah: 'జంగిల్‌రాజ్' వద్దంటే NDAకే ఓటు వేయాలి
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిహార్ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 'జంగిల్‌రాజ్' (ఆటవిక పాలన) తిరిగి రావద్దంటే, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఆయన కోరారు.
Amit Shah: 'జంగిల్‌రాజ్' వద్దంటే NDAకే ఓటు వేయాలి
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిహార్ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 'జంగిల్‌రాజ్' (ఆటవిక పాలన) తిరిగి రావద్దంటే, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఆయన కోరారు. దర్భాంగాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అమిత్ షా, ఈ ఎన్నికలు మోదీ-నితీశ్ అభివృద్ధి మోడల్‌కు, ఆర్జేడీ (RJD) 'జంగిల్‌రాజ్‌కు' మధ్య జరుగుతున్న పోటీగా అభివర్ణించారు.
రాష్ట్రంలో ఆర్జేడీ పాలనపై అమిత్ షా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం 'జీవికా దీదీల' ఖాతాలలో జమ చేసిన సొమ్మును ఆర్జేడీ నేతలు దోచుకోవాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. "లాలూ తాతలు దిగొచ్చినా... ఆ సొమ్మును దోచుకోలేరు" అని గట్టిగా హెచ్చరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే బిహార్‌ను సమగ్ర అభివృద్ధి వైపు నడిపించగలదని అమిత్ షా హామీ ఇచ్చారు. బిహార్ ప్రజలు అభివృద్ధి వైపు నిలబడి, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.