Amit Shah: దేశానికి ప్రధాన మంత్రి కావాలనే కోరికతోనే నితీష్ కుమార్.. కాంగ్రెస్, RJDతో చేతులు కలిపారు
Amit Shah: నితీష్ కుమార్‌పై అమిత్ షా విమర్శలు
Amit Shah: దేశానికి ప్రధాన మంత్రి కావాలనే కోరికతోనే నితీష్ కుమార్.. కాంగ్రెస్, RJDతో చేతులు కలిపారు
Amit Shah: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను టార్గెట్ చేస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధాన మంత్రి కావాలనే కోరికతోనే నితీష్ కుమార్.. కాంగ్రెస్, RJDతో చేతులు కలిపారని తీవ్ర విమర్శలు చేశారు. బీహార్ పర్యటనలో భాగంగా పశ్చిమ చంపారన్‌లో బీజేపీ శ్రేణులు తలపెట్టిన బహిరంగసభలో అమిత్ షా పాల్గొన్నారు. ప్రధాని మోడీ తాను ఇచ్చిన మాట కోసం నితీష్‌ను సీఎంను చేశారు.. కానీ నితీష్ మాత్రం మూడేళ్లకోసం ప్రధాని కావాలనే కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.