Amarnath Yatra 2023: రిజిస్ట్రేషన్లు షురూ.. భక్తులకు ఈసారి కొత్త రూల్‌..!

Amarnath Yatra 2023: అమర్‌నాథ్‌ యాత్ర ఈ ఏడాది జూలైలో ప్రారంభం కానుంది.

Update: 2023-04-17 09:24 GMT

Amarnath Yatra 2023: రిజిస్ట్రేషన్లు షురూ.. భక్తులకు ఈసారి కొత్త రూల్‌..!

Amarnath Yatra 2023: అమర్‌నాథ్‌ యాత్ర ఈ ఏడాది జూలైలో ప్రారంభం కానుంది. జూలై 1న ప్రారంభమయ్యే యాత్ర ఆగస్టు 31న ముగుస్తుందని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 62 రోజులపాటు యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ యాత్ర కోసం అనంతనాగ్‌ జిల్లాలోని పహల్గామ్‌ ట్రాక్‌లో, గండేర్‌బల్‌ జిల్లాలోని బల్తాల్‌ ట్రాక్‌లో రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.

ఆఫ్‌ లైన్, ఆన్‌లైన్ ద్వారా భక్తులు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 542 బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 316 పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ శాఖలు, 37 ఎస్‌ బ్యాంక్‌ శాఖలు, 99 ఎస్‌బీఐ బ్యాంక్‌ శాఖలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఏడాది రిజిస్ట్రేషన్లో అధికారులు కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. యాత్రలో పాల్గొనబోయే భక్తులు కచ్చితంగా ఆధార్‌తో రిజిస్ట్రేషన్ చేయించి వేలిముద్ర స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ యాత్రకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలు..

13-70 ఏళ్ల భక్తులే ఈ యాత్రలో పాల్గొనేందుకు అర్హులు

అందరూ కచ్చితంగా ఆరోగ్య ధ్రువపత్రాన్ని పొందుపర్చాలి

ఆరు వారాలకు పైబడిన గర్భిణీలు యాత్రలో పాల్గొనడానికి అనుమతి లేదు

Tags:    

Similar News