Amarnath Yatra 2020 latest news: అమర్ నాధ్ యాత్ర... రోజుకు 500 మందికే అనుమతి

Amarnath Yatra 2020 latest news: కరోనా వ్యాప్తి అన్ని వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది.

Update: 2020-07-05 02:55 GMT

Amarnath Yatra 2020 latest news: కరోనా వ్యాప్తి అన్ని వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. పిల్లల బడులు దగ్గర్నుంచి, పెద్దలు దేవుడి దర్శనాలపై కూడా దీని ప్రభావం పడింది. కష్టంతో కూడుకున్న దయినా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏటా వేల సంఖ్యలో అమర్ నాధ్ దర్శనానికి వెళుతుంటారు. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దీనిపై షరతులు విధించారు. పరిమిత సంఖ్యలో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. దీని ప్రభావం అమర్‌నాథ్ యాత్రపై కూడా పడింది. ఈ ఏడాది కేవలం రోజుకు 500 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తామని జమ్మూ-కాశ్మీర్ చీఫ్ సెక్రటరీ బీవీఆర్ సుబ్రహ్మణ్యం శనివారం చెప్పారు. జమ్మూ నుంచి రోజుకు 500 మంది భక్తులు అమర్‌నాథ్‌కు వెళ్ళవచ్చునని తెలిపారు.

కరోనా ప్రభావం నేపథ్యంలో.. జమ్మూ-కశ్మీరులో ప్రవేశించే భక్తులకు కోవిడ్-19 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వర్తిస్తుందని చెప్పారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సబ్ కమిటీతో అమర్‌నాథ్ యాత్ర కోసం జరుగుతున్న ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ శనివారం చర్చించారు. జమ్మూ-కశ్మీరులో ప్రవేశించే భక్తులు తప్పనిసరిగా కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని, నెగెటివ్ రిపోర్టు వచ్చే వరకు క్వారంటైన్‌లో ఉండాలని తెలిపారు. గతంలో యాత్రికుల శిబిరాలుగా ఉపయోగపడిన భవనాలను ఈ ఏడాది క్వారంటైన్ సెంటర్లుగా ఉపయోగిస్తామని చెప్పారు.

నిజానికి అత్యంత క్లిష్టమైన అమర్‌నాథ్ యాత్రలో కరోనా నేపధ్యంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా కష్టమైన పని. కానీ, భక్తులలో ఉండే నమ్మకాల దృష్ట్యా పరిమితంగా అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. 


Tags:    

Similar News