ఎల్లుండి నుంచి అమర్‌నాథ్‌ యాత్ర షురూ.. యాత్రికులకు సకల సౌకర్యాలు..

Amarnath Yatra 2022: ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్‌ యాత్ర కోసం జమ్ముకశ్మీర్ సర్కార్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

Update: 2022-06-28 13:30 GMT

ఎల్లుండి నుంచి అమర్‌నాథ్‌ యాత్ర షురూ.. యాత్రికులకు సకల సౌకర్యాలు..

Amarnath Yatra 2022: ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్‌ యాత్ర కోసం జమ్ముకశ్మీర్ సర్కార్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. యాత్రికుల కోసం పహల్గామ్‌లోని చందన్‌వారిలో వైద్య శిబిరాలను అందుబాటులోకి తెచ్చారు. బాల్టాల్, పహల్గాం ప్రయాణ మార్గాలలో యాత్రికుల కోసం టెంట్లు వేస్తున్నారు. ఈ బేస్ క్యాంపులలో వసతి, వైద్య సంరక్షణ, కమ్యూనికేషన్ నెట్‌వర్క్, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వాతావరణ అంచనా, అత్యవసర ప్రతిస్పందన, అగ్నిమాపక భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

ఆగస్ట్ 11 వరకు 6 వారాలపాటు కొనసాగనున్న అమర్ నాథ్ తీర్థయాత్రకు అవసరమైన ప్రాథమిక అవసరాలన్నింటినీ ప్రభుత్వం సమకూరుస్తోంది. మరోవైపు అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఆస్పత్రిని సిద్ధం చేస్తున్నారు. యాత్రికులకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు, ఐసోలేషన్ సౌకర్యాలు కూడా ప్రతిచోటా అందుబాటులో ఉంచుతున్నారు.

Tags:    

Similar News