ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు అఖిలపక్ష సమావేశం

*సమావేశాలకు సహకరించాలని విపక్షాలను కోరనున్న కేంద్రం

Update: 2023-01-30 05:01 GMT

ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు అఖిలపక్ష సమావేశం

Delhi: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు సమావేశానికి అన్ని పార్టీలకు ఆహ్వానం పంపింది. పార్లమెంట్ హౌజ్ కాంప్లెక్స్‌లో ఈ సమావేశం జరుగుతుంది. బడ్జెట్‌ సమావేశాల దృష్ట్యా సజావుగా సభలు సాగేందుకు సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరనున్నట్లు తెలుస్తోంది. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్‌ ఇదేకానుంది. అందుకే విపక్షాలకు విజ్ఞప్తి చేయనుంది కేంద్రం. ఇదిలా ఉంటే.. రేపు పార్లమెంట్‌ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో మొదలుకానున్నాయి. ప్రసంగం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. ఇక బుధవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు ఆర్థిక మంత్రి.

Tags:    

Similar News