Mani Shankar Aiyar: 1962లో భారత్‌పై చైనా దాడి ఆరోపణలేనట.. మణిశంకర్ అయ్యర్ మరో దుమారం
Mani Shankar Aiyar: కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1962 నాటి చైనా దాడిని ‘ఆరోపణ’గా అభివర్ణించారు.
Mani Shankar Aiyar: 1962లో భారత్‌పై చైనా దాడి ఆరోపణలేనట.. మణిశంకర్ అయ్యర్ మరో దుమారం
Mani Shankar Aiyar: సార్వత్రిక ఎన్నికల వేళ సొంత పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారాయి. పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని... ఆ దేశాన్ని గౌరవించాలంటూ గతంలో మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. తాజాగా మరోసారి ఆయన మరో వివాదానికి తెరలేపారు. 1962 నాటి భారత్ చైనా యుద్ధం గురించి ప్రస్తావిస్తూ... నాడు భారత్‌పై చైనా బలగాలు దాడి చేశాయనే ఆరోపణలు ఉన్నాయన్నారు. వాస్తవంగా జరిగిన దాడిని అయ్యర్ ఆరోపణ అని పేర్కొనడం దుమారం రేపింది.