Ahmedabad Plane Crash: ప్రాథమిక విచారణతో పైలెట్లపై నిందలు వేయడం తగదు- పుష్కరాజ్ సభర్వాల్

Air India Ahmedabad Plane Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 2025 జూన్ 12 మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైన్ 787 విమానం టేకాఫ్ అయ్యింది.

Update: 2025-09-18 06:18 GMT

Air India Ahmedabad Plane Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 2025 జూన్ 12 మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైన్ 787 విమానం టేకాఫ్ అయ్యింది. సరిగ్గా టేపాఫ్ అయిన కొన్ని నిమిషాల్లో విమానాశ్రయం సమీపంలో ఉన్న ఓ హాస్టల్ భవనాన్ని ఢీకొట్టింది. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 241 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనస్థలానికి చేరుకుని సహాయ చర్యలు కొనసాగించారు. ఈ ప్రమాదంలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడగా.. మిగతావారు మరణించారు. విమానం హాస్టల్ భవనాన్ని ఢీకొట్టడంతో విద్యార్థులు 30 మంది మృతి చెందారు.

ఈ ప్రమాద ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఈ ఘటనకు సంబంధించి ఏఏఐబీ కీలక విషయాలు వెల్లడించింది. విమానం టేకాఫ్‌ అయిన తరువాత సెకన్ల వ్యవధిలో ఇంధన కంట్రోల్‌ స్విచ్‌లు ఆగిపోయినట్లు వెల్లడించింది. ఆ స్విచ్‌ ఎందుకు ఆఫ్‌ చేశారని విచారణ చేయగా.. తాను స్విచ్‌ ఆఫ్‌ చేయలేదని సమాధానం ఇచ్చారని పైలట్‌ సమాధానం ఇచ్చారని రిపోర్టులో పేర్కొన్నారు. పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ తెలిపింది. ఈ రెండు స్విచ్‌లు ఒక సెకను తేడాతో ఒకదాని తర్వాత మరొకటి ఆగినట్లు నివేదికలో తెలిపింది. ప్రమాదానికి ముందు విమానం కేవలం 32 సెకన్ల పాటు గాల్లో ఉన్నట్లు వెల్లడించింది. రన్‌వేకు కేవలం 0.9 నాటికల్‌ మైళ్ల దూరంలోని ఓ హాస్టల్‌ భవంతిపై విమానం కూలిపోయిందని నివేదిక వివరించింది. ఇంజిన్లు శక్తిని కోల్పోయిన తర్వాత ర్యామ్‌ ఎయిర్‌ టర్బైన్‌ను యాక్టివేట్‌ చేసినట్లు గుర్తించారు. విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికితీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్‌ను గుర్తించామని పేర్కొంది. ఇంజిన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. విమానంలో ఇంధనం కూడా స్వచ్ఛంగానే ఉందని, కలుషితమైన ఆనవాళ్లు లేవని తెలిపింది. పైలెట్ల డిప్రెషన్ వల్ల ఈ ప్లైట్ కూలిందని ఏఏఐబీ నివేదిలో వెల్లడించింది.

అహ్మదాబాద్ విమాన ఘటనపై కెప్టెన్ సుమీత్ సబర్వాల్ తండ్రి సరైన దర్యాప్తు జరపాలని కోరారు. ఇప్పటివరకు ప్రాథమిక నివేదిక మాత్రమే ఏఏఐబీ వెల్లడించిందన్నారు. విమానాన్ని తయారుదారుడు ఈ ఘటనపై తీవ్ర ప్రభావం చూపి.. పైలట్లపై నింద మోపారని ఆయన ఆరోపించారు. తన కొడుకు ప్రతిష్టను దెబ్బతీసేలా ఊహాగానాలకు దారితీసిందన్నారు.ఈ ప్రమాదంపై స్వతంత్ర, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కెప్టెన్ సుమీత్ సభర్వాల్ తండ్రి పుష్కరాజ్ సభర్వాల్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. పైలట్ సుమీత్ సబర్వాల్‌ తల్లి చనిపోయి మూడు సంవత్సరాలు అయినా.. ఆ తర్వాత కెప్టెన్ ఎటువంటి సంఘటన లేకుండా 100కి పైగా విమానాలను నడిపారని తెలిపారు. 25 సంవత్సరాల సర్వీసులో 15638 గంటలు విమానం నడిపిన అనుభంవం ఉందన్నారు. అతను పైలెట్ శిక్షకుడని తెలిపారు. అలాంటి వ్యక్తులపై నిస్వార్థమైన విచారణ చేపట్టాలని విమానయాన మంత్రిత్వ శాఖకు వెల్లడించారు.

Tags:    

Similar News