Army Chief: తగ్గేదే లే.. త్వరలోనే అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ ప్రకటన..
Agnipath Recruitment: అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా యువకుల్లో అగ్గి రాజేస్తుంటే కేంద్రం మాత్రం వెనక్కి తగ్గేదే లే అంటోంది.
Army Chief: తగ్గేదే లే.. త్వరలోనే అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ ప్రకటన..
Agnipath Recruitment: అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా యువకుల్లో అగ్గి రాజేస్తుంటే కేంద్రం మాత్రం వెనక్కి తగ్గేదే లే అంటోంది. త్వరలోనే అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ షెడ్యూల్ ను ప్రకటిస్తామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే స్పష్టం చేశారు. ఆర్మీలో రిక్రూట్ మెంట్ వయస్సును 23 ఏళ్లకు పెంచామని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని యువతకు దేశభక్తిని చాటుకునే అవకాశం దొరుకుతుందని మనోజ్ పాండే అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో ఎంతో కష్టపడ్డ యువతకు ఇప్పుడు మంచి అవకాశం లభించిందని చెప్పారు. అగ్నివీరులుగా సైన్యంలో చేరే అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని ఆయన సూచించారు.