CoronaVirus: భారత్‌లో మరోసారి విజృంభిస్తున్న కరోనా

CoronaVirus: దేశంలో కొత్తగా 17,407 పాజిటివ్‌ కేసులు * దేశవ్యాప్తంగా 1,11,39,516 కరోనా కేసులు నమోదు

Update: 2021-03-04 08:24 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

CoronaVirus: భారత్‌లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 17 వేల 407 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోటి 11 లక్షల 39వేల 516 కరోనా కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 89 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో.. కరోనా మరణాల సంఖ్య లక్షా 57వేల 435కు చేరింది.

ప్రస్తుతం దేశంలో లక్షా 73వేల 413 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. నిన్న 7లక్షల 75వేల 631 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది. మరోవైపు దేశంలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్‌ సజావుగా కొనసాగుతోంది. టీకా కోసం దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 60 ఏళ్లు పైబడిన వృద్ధుల రద్దీ పెరగడంతో.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టీకాపై సమయ నిబంధన ఎత్తివేసింది. ఇకపై ప్రజలు 24 గంటల్లో ఎప్పుడైనా కొవిడ్‌ టీకా తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

Tags:    

Similar News