Congress: అప్పుడు నానమ్మ ఇందిరా.. ఇప్పుడు మనవడు రాహుల్‌..!

Congress: నెహ్రూ-గాంధీ కుటుంబ వారసుడిగా రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు.

Update: 2023-03-25 05:32 GMT

Congress: అప్పుడు నానమ్మ ఇందిరా.. ఇప్పుడు మనవడు రాహుల్‌..!

Congress: నెహ్రూ-గాంధీ కుటుంబ వారసుడిగా రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు. నానమ్మ ఇందిర లాగే పార్టీలో తిరుగులేని నేతగా ఎదగాలని, ప్రధాని కావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందిరాగాంధీలా ప్రధాని అవుతారో, లేదో తెలియదుగానీ..ఆమెలాగే మనవడు రాహుల్ అనర్హత వేటుకు మాత్రం గురయ్యారు. ఇందిరాగాంధీ కూడా 1975లో ఇలాగే అనర్హతకు గురయ్యారు. పైగా ఆమె ప్రధానిగా ఉండగానే అనర్హతను ఎదుర్కొన్నారు. అదే అనర్హత చివరికి మన దేశంలో ఎమర్జెన్సీకి దారితీసింది.

1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీలో గెలుపొంది ప్రధాని పదవిని ఇందిరాగాంధీ చేపట్టారు. ఇందిరాగాంధీ పోటీ చేసిన రాయ్‌బరేలీలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ..ఇందిరాగాంధీ చేతిలో ఓడిపోయిన రాజ్‌నారాయణ్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని విచారించిన అలహాబాద్‌ హైకోర్టు.. ఇందిర ఎన్నిక చెల్లదంటూ రాజ్‌నారాయణ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఇందిరాగాంధీపై ఆరేళ్లపాటు అనర్హత వేటు పడింది. ఇందిర పైకోర్టుకు వెళ్లి అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై స్టే తెచ్చుకున్నారు. అయితే అప్పుడు ఇందిర అధికారంలో ఉండగా.. ఇప్పుడు రాహుల్‌గాంధీ ప్రతిపక్షంలో ఉన్నారు.

Tags:    

Similar News