IMD: 1877 తర్వాత ఈ ఫిబ్రవరిలోనే సూర్యుని ప్రకోపం

IMD: ఈ ఏడాది సఘటున 29.54 డిగ్రీల ఉష్ణోగ్రత

Update: 2023-03-01 06:30 GMT

IMD: 1877 తర్వాత ఈ ఫిబ్రవరిలోనే సూర్యుని ప్రకోపం

Summer Weather: వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశంలో 1877 తరువాత ఈ ఫిబ్రవరిలోనే గరిష్ట ఉష్టోగ్రతలు నమోదైనట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది సఘటున ఉష్ణోగ్రత 29.54 డిగ్రీలుగా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ఈ పరిణామం చోటు చేసుకున్నట్టు తెలిపింది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ధక్షిణ భారతం, ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలు తప్ప మిగిలిన చోట్ల ఈ వేసవిలో ఉష్టోగ్రతలు పెరిగే అవకాశముంది. మిగిలిన ప్రాంతాల్లో సాధారణం, అంత కంటే తక్కువ ఉష్టోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి.

మధ్య భారతం, దానిని అనుకొని ఉన్న నైరుతి భాగంలో మార్చి నుంచి మే మధ్యకాలంలో వడగాలులు వీచే అవకాశముంది. అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా సగటున 16.82 డిగ్రీలుగా నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంత తక్కువ స్థాయిలో నమోదు కావడం అయిదోసారి. ఈఫిబ్రవరిలో వాయువ్య భారత్ లో 24.86 డిగ్రీలు, మధ్యభారత్ లో 31.86 డిగ్రీలు, ఈ శాన్యభారత్ లో 13.99 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే మార్చి నుంచి మే నెలల మధ్య కాలంలో దేశంలోని ఈశాన్యం, తూర్పు, మధ్యభారతంలోని చాలా ప్రాంతాల్లో నైరుతి ప్రాంతంలోనికొన్నిప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. 

Tags:    

Similar News