Adhir Ranjan: కాంగ్రెస్‌కు రెండు సీట్లు ఇవ్వడం దారుణం.. ఒంటరిగా పోటీ చేసినా ఇంతకంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం
Adhir Ranjan Chowdhury: కాంగ్రెస్‌కు కొత్తగా ఇచ్చిన సీట్లు ఏమీ లేవు
Adhir Ranjan: కాంగ్రెస్‌కు రెండు సీట్లు ఇవ్వడం దారుణం.. ఒంటరిగా పోటీ చేసినా ఇంతకంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం
Adhir Ranjan Chowdhury: తృణమూల్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బెంగాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి అసహనం వ్యక్తం చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తృణమూత్‌తో పొత్తు విషయంపై ఆయన స్పందించారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు మమతా మొండి చేయి చూపించారని చెప్పారు. మమత సూచించిన రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీవేనని గుర్తు చేశారు. పొత్తులో భాగంగా మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఇచ్చిన సీట్లు ఏమీ లేవని అన్నారు. సీట్ల పంపకాలపై మమత బెనర్జీ అసలు వ్యూహం ఇప్పుడు అర్ధమైందని చెప్పారు అధీర్ రంజన్ చౌదరి. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే ఇంత కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.