తన వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి వివరణ
Adhir Ranjan Chaudhary: తాను ఒకసారి పొరపాటున కామెంట్ చేశానని వెల్లడి
తన వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి వివరణ
Adhir Ranjan Chaudhary: తన వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి వివరణ ఇచ్చారు. రాష్ట్రపతి భవన్ వద్ద నిరసన తెలుపుతుండగా పోలీసులు తమను అడ్డుకున్నారని ఆ క్రమంలో తాను పొరపాటున రాష్ట్రపత్ని అన్నానని తెలిపారు. అది విన్న పాత్రికేయుడి కోసం తాను వెతికినా కనిపించలేదన్నారు. దీన్ని బీజేపీ అస్త్రంగా వాడుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రపతిగా అత్యున్నత పదవిలో ఉన్నవాళ్లెవరైనా కులంతో సంబంధం లేదన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి మరల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అధీర్ రంజన్ చౌదర్ వ్యాఖ్యానించారు. తాను ఒకసారి మాత్రమే పొరపాటున అన్న పదాన్ని వివాదాస్పదం చేయడం సరికాదని తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు అధీర్ రంజన్.