జనాభా నియంత్రణ బిల్లు లోక్‎సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి రవికిషన్ పై నెటిజన్ల సెటైర్లు

*నలుగురు పిల్లల తండ్రి అయిన రవికిషన్.. జనాభా నియంత్రణ బిల్లు ప్రవేశపెట్టడం ఏమిటని చురకలు

Update: 2022-07-24 11:52 GMT

జనాభా నియంత్రణ బిల్లు లోక్‎సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి రవికిషన్ పై నెటిజన్ల సెటైర్లు

Union Minister Ravi Kishan: నటుడు, భాజపా ఎంపీ రవికిషన్ లోక్‎సభలో జనాభా నియంత్రణ బిల్లు ప్రవేశ పెట్టారు. ఈసందర్భంగా మంత్రి రవికిషన్ మాట్లాడడుతూ.. ఒక జంట ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం కలిగి ఉండకుండా నిరోధించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 'జనాభా నియంత్రణ బిల్లును తీసుకువచ్చినప్పుడే మనం విశ్వగురువు కాగలమని కామెంట్ చేశారు. అంతేకాదు ఈబిల్లు ఆమోదానికి విపక్ష పార్టీలు సహకరించాలని కోరారు.

ఈసందర్భంగా తానుఈ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టాలనుకుంటున్నానో పూర్తిగా వినాలన్నారు. అయితే నలుగురు పిల్లలకు తండ్రిగా ఉన్న రవికిషన్ ఈ బిల్లును ప్రవేశపెట్టడమేంటని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనాను దాటి భారత్‌ నిలవనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని '2022 ప్రపంచ జనాభా అంచనాల' నివేదికను ఐరాస విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ బిల్లు తెరపైకి వచ్చింది.

Tags:    

Similar News