Viral Video: కారులో నుంచి కరెన్సీ నోట్లు విసిరేసిన యువకుడు

Viral Video: గురుగ్రామ్‌లో ఘటన, కేసు నమోదు చేసిన పోలీసులు

Update: 2023-03-15 04:00 GMT

Viral Video: కారులో నుంచి కరెన్సీ నోట్లు విసిరేసిన యువకుడు

Viral Video: కారులోంచి కరెన్సీ నోట్లను వెదజల్లుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ ఘటన కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఇద్దరు యువకులు కారులో ప్రయాణించారు. ఈ క్రమంలో ఒకరు వాహనం నడుపుతుండగా.. మరొకరు కారు వెనుక భాగం నుంచి రోడ్లపై కరెన్సీ నోట్లు విసిరారు. అతడు ముఖానికి కర్చీఫ్ కప్పుకొని కనిపించాడు. అయితే అవి అసలు నోట్లా..? నకిలీవా అనేది తెలియరాలేదు. ఢిల్లీకి చెందిన ఓ యూట్యూబర్ ఈ పనిచేసినట్లు తెలుస్తోంది. సంబంధిత వీడియో ఆధారంగా పోలీసులు వారిపై కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News