Geeta Bharat Jain: పబ్లిక్‌లో ఇంజనీర్ చెంప చెళ్లుమనిపించిన మహిళా MLA
Geeta Bharat Jain: కూల్చివేతపై ఇంజనీర్లతో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే
Geeta Bharat Jain: పబ్లిక్‌లో ఇంజనీర్ చెంప చెళ్లుమనిపించిన మహిళా MLA
Geeta Bharat Jain: మహారాష్ట్ర లో ఓ మహిళా ఎమ్మెల్యే అందరి ముందూ ఓ ఇంజినీర్ చెంప చెళ్లుమనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే థానే జిల్లా మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇందులో భాగంగానే పెంకర్ పెడా ప్రాంతంలో గల అక్రమ నిర్మాణాలను ఇంజినీర్ లు శుభమ్ పాటిల్, సోనీ కూల్చివేశారు. అయితే వర్షం కురుస్తున్న సమయంలో కూల్చివేతలు చేపట్టడంతో ఆరు నెలల చిన్నారి సహా వృద్ధులు వర్షంలోనే గడపాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గీతా జైన్ అక్కడికి చేరుకున్నారు. రోడ్డు పైనే ఇద్దరు ఇంజినీర్లతో వాగ్వాదానికి దిగారు.
వర్షం కురుస్తున్న సమయంలో నిర్మాణాలను ఎలా కూలుస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగైన జూనియర్ సివిల్ ఇంజినీర్ శుభమ్ పాటిల్‌పై ఎమ్మెల్యే చేయిచేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణల కూల్చివేతలో తప్పేముంది అంటూ ప్రశ్నిస్తున్నారు .ఇంజినీర్ పై చేయి చేసుకున్న ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే తన చర్యను సమర్థించుకోవడం గమనార్హం.