Maharashtra: రన్నింగ్‌ బస్సులో మంటలు.. 25 మంది సజీవదహనం

Maharashtra: మరో 8 మందికి తీవ్రగాయాలు, పరిస్థితి విషమం

Update: 2023-07-01 03:27 GMT

Maharashtra: రన్నింగ్‌ బస్సులో మంటలు.. 25 మంది సజీవదహనం

Maharashtra: మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది సజీవ దహనమయ్యారు. బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఈ ఘటన జరిగింది. యావత్మాల్ నుంచి పుణెకు 32 మందితో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 25 మంది సజీవ దహనమయ్యారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బుల్దానా ప్రభుత్వా్స్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో బస్సు పూర్తిస్థాయిలో కాలిపోయింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పారు. 

Tags:    

Similar News