Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై కొత్త కేసు..!
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై మరో కేసు నమోదు అయ్యింది. బాణసంచా వినియోగంపై ఢిల్లీలో నిషేధం విధించి ఉండటమే కేసు నమోదు చేయడానికి గల కారణంగా తెలుస్తుంది.
arvind kejriwal
Arvind Kejriwal: జైలు నుంచి నిన్ననే విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై మరో కేసు నమోదు అయ్యింది. జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్‌కు ఆప్ కార్యకర్తలు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటూ.. ఊరేగింపు నిర్వహించారు. సంబరాల్లో భాగంగా టపాసులతో స్వాగతం పలికారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
బాణసంచా వినియోగంపై ఢిల్లీలో నిషేధం విధించి ఉండటమే కేసు నమోదు చేయడానికి గల కారణంగా తెలుస్తుంది. దేశ రాజధాని నగరంలో కాలుష్య నియంత్రణే లక్ష్యంగా బాణసంచా తయారీ, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు గత సోమవారం ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 వరకు అమలులో ఉండనుంది.
ఆన్‌లైన్‌లో విక్రయాలు, డెలివరీలకూ ఈ నిషేధం వర్తిస్తుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. కేజ్రీవాల్‌కు స్వాగతం పలికే క్రమంలో బాణాసంచా పేల్చడంతో కాలుష్యం సంభించింది. దీంతో భారతీయ న్యాయ సంహిత చట్టం కింద గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.