West Bengal: వీడికేం పోయేకాలం వచ్చింది.. భార్య ముక్కు అందంగా ఉందని కొరికేశాడు.. తర్వాత ఏం జరిగిందంటే?
West Bengal: ఈ మధ్య కాలంలో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న భర్త గడ్డం నచ్చలేదని మరిదితో పారిపోయిన భార్య వార్త వైరల్ గా మారింది. ఇప్పుడు తాజాగా భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కుతిన్నాడో భర్త. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో జరిగింది. శాంతీపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేర్పారా ప్రాంతంలో భర్త బాపన్ షేక్ తో కలిసి మధు ఖాతూన్ అనే మహిళ నివసిస్తోంది. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు బాపన్ షేక్ ఇంట్లో ఒక్కసారిగా అరుపులు వినిపించాయి. మధు ఖాన్ అరుపులు, కేకలు వినిపించాయి. ఆమె ముక్కు, వేలు నుండి తీవ్ర రక్త స్రావం జరిగింది. ఈ దారుణంపై తన తల్లితో కలిసి శాంతీపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మధు ఖాతూన్..భర్తపై కంప్లెయింట్ చేసింది. అవకాశం దొరికితే నీ ముక్కును కొరికి తినేస్తానని తన భర్త అనేవాడని..చివరకు అన్నంత పనిచేశాడంటూ ఫిర్యాదు పేర్కొంది.