Yusuf Pathan: అల్లర్ల మధ్యే ఇన్‌స్టాగ్రామ్‌లో యూసుఫ్ పఠాన్ 'గుడ్ ఛాయ్' పోస్ట్... ఏకిపారేస్తున్న బీజేపి


Yusuf Pathan: అల్లర్ల మధ్యే ఇన్‌స్టాగ్రామ్‌లో యూసుఫ్ పఠాన్ 'గుడ్ ఛాయ్' పోస్ట్... ఏకిపారేస్తున్న బీజేపి
Yusuf Pathan's Good Chai Post gets huge backlash: మాజీ క్రికెటర్, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన యూసుఫ్ పఠాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో...
Yusuf Pathan's Good Chai Post gets huge backlash: మాజీ క్రికెటర్, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన యూసుఫ్ పఠాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టి విమర్శల పాలయ్యారు. మధ్యాహ్నం పూట ఛాయ్ తాగుతూ ఫోటోలు దిగిన యూసుఫ్ పఠాన్, ఆ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. మధ్యాహ్నం మంచి వాతావణంలో ఛాయ్ ఎంజాయ్ చేస్తున్నాను అని ఆ పోస్టులో పేర్కొన్నారు. పఠాన్ పెట్టిన ఆ పోస్టు ఆయన్ను ఊహించని విధంగా రాజకీయంగా, వ్యక్తిగతంగా విమర్శల పాలయ్యేలా చేసింది.
గత వారం రోజులుగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో హింసాత్మక వాతావరణం నెలకొని ఉంది. వక్ఫ్ అమెండ్‌మెంట్ యాక్టును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ధర్నాలకు దిగుతున్నారు. కొన్నిచోట్ల ఈ ధర్నాలు హింసాత్మకంగా మారి ముగ్గురి ప్రాణాలు తీశాయి. అల్లర్లు జరుగుతున్న ప్రాంతం యూసుఫ్ పఠాన్ లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న బహరాంపూర్ నియోజకవర్గం పరిధిలోకి రాకపోయినప్పటికీ, ఆ నియోజకవర్గానికి అతి దగ్గర్లోనే అల్లర్లు జరుగుతున్నాయి.
అయితే, నియోజకవర్గం చుట్టూ విధ్వంసం జరుగుతుంటే, ఆయన మాత్రం ఆ అల్లర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా గుడ్ ఛాయ్ అని ఛాయ్ ఎంజాయ్ చేస్తూ పోస్ట్ పెడతారా అని బీజేపి మద్దతుదారులు తీవ్రంగా మండిపడుతున్నారు.
Bengal is burning
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) April 13, 2025
HC has said it can’t keep eyes closed and deployed centra forces
Mamata Banerjee is encouraging such state protected violence as Police stays silent!
Meanwhile Yusuf Pathan - MP sips tea and soaks in the moment as Hindus get slaughtered…
This is TMC pic.twitter.com/P1Yr7MYjAM
రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పి అల్లర్లు జరుగుతుంటే, ఒక బాధ్యత కలిగిన ఎంపీగా యూసుఫ్ పఠాన్ నడుచుకునే వైఖరి ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.
Most read interesting news stories: జనం ఎక్కువగా చదివిన వార్తా కథనాలు
- మరో వారం రోజుల్లో బిడ్డకు పెళ్లి పెట్టుకుని కాబోయే అల్లుడితో అత్త జంప్
- రిటైర్మెంట్ రోజు లాస్ట్ ట్రిప్‌కు వెళ్లిన లోకో పైలట్... సిగ్నల్ వద్ద రైలును ఢీకొట్టిన గూడ్స్ రైలు
- Why Nifty IT falling? సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా పేరున్న ఐటి కంపెనీల స్టాక్స్ ఎందుకు పడిపోతున్నాయి? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రానున్నది గడ్డు కాలమేనా?
- Indian students in US: అమెరికాలో కొత్త బిల్లు... వణికిపోతున్న 3 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్
- పంబన్ బ్రిడ్జి ప్రారంభించిన ప్రధాని మోదీ... ఈ రూట్లో ఇండియా నుండి శ్రీలంక ఎలా వెళ్తారంటే..

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



