Ghaziabad: ఘజియాబాద్ లో చిన్నారిపై కుక్క దాడి

Ghaziabad: బాలుడి ముఖంపై 150 కుట్లు వేసిన వైద్యులు

Update: 2022-09-11 03:12 GMT

Ghaziabad: ఘజియాబాద్ లో చిన్నారిపై కుక్క దాడి

Ghaziabad: ఇటీవల చిన్నారులపై కుక్కకాట్లు ఎక్కువయ్యాయి. యూపీలోని ఘజియాబాద్, నోయిడాలో చిన్నారులపై కుక్కలు దాడి చేసిన ఘటన మరువకముందే ఘజియాబాద్ లో మరో ఘోర ఘటన చోటు చేసుకుంది. పదేళ్ల చిన్నారిపై ఓ పిట్ బుల్ డాగ్ విచక్షణారహితంగా దాడి చేసింది. ఆ బాలుడి ముఖంపై పలు చోట్ల కుక్క కరిచింది. 150 చోట్ల కుట్లు పడ్డాయి. సంజయ్ నగర్ పార్కులో కుక్క యజమాని లలిత్ త్యాగి వాకింగ్ కోసం తన పిట్ బుల్ డాగ్ ను తీసుకువెళ్లాడు.. ఆ కుక్క తప్పించుకుని అక్కడే ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేసింది. యజమాని ఎంత ప్రయత్నించినా కుక్క కంట్రోల్ కాలేదు. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కను పెంచుకుంటున్న యజమానికి అధికారులు ఐదు వేలు జరిమాన విధించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News