90 Degree Bridge: 90 డిగ్రీల రైల్వే బ్రిడ్జిపై విమర్శలు.. ఏడుగురు ఇంజనీర్లు సస్పెండ్..రూ.18 కోట్లు నష్టం
90 Degree Bridge: భోపాల్‌లో 90 డిగ్రీల మలుపులో నిర్మించిన రైల్వే బిడ్జ్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
90 Degree Bridge: 90 డిగ్రీల రైల్వే బ్రిడ్జిపై విమర్శలు.. ఏడుగురు ఇంజనీర్లు సస్పెండ్..రూ.18 కోట్లు నష్టం
90 Degree Bridge: భోపాల్‌లో 90 డిగ్రీల మలుపులో నిర్మించిన రైల్వే బిడ్జ్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది ఈ బ్రిడ్జ్‌ని విమర్శించారు. ముఖ్యంగా ఈ బ్రిబ్జ్ డిజైన్ వింతగా ఉందంటూ కామెట్లు ఎక్కువయ్యాయి. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి, చర్యలు తీసుకుంది. ఈ బ్రిడ్జ్ కోసం ప్లాన్ చేసిన ఏడుగురు ఇంజనీర్లపై సస్పెండ్ వేటు వేసింది. దీంతో రైల్వే రంగానికి రూ. 18 కోట్లు నష్టం వాటిల్లింది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన ఒక రైల్వే బ్రిడ్జ్ దేశవ్యాప్తంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ అసాధారణ డిజైన్‌పై సోషల్ మీడియాలో విమర్శలు, మీమ్స్ ఎక్కువయ్యాయి. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం ఎక్కువగా ఉందనే కామెంట్లు ఎక్కువగా వచ్చాయి. దీంతో ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విచారణ జరిపింది. చివరకు ఏడుగురు ఇంజనీర్లపై వేటు వేసి వారిని సస్పెండ్ చేసింది.
ఒకటి కాదు రెండు కాదు.. ఈ బ్రిడ్జ్‌ను నిర్మించేందుకు మూడుసార్లు ప్లాన్లు వేసారు. రైల్వే శాఖ మరియు పీడబ్యుగుడీ (public works department)లు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాయి. అయితే ఈ రెండు శాఖల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల ఈ బ్రిడ్జ్ ప్లాన్‌ను మూడు సార్లు మార్చినట్లు తెలుస్తోంది. ఈ వంతెనపై విమర్శలు వచ్చిన తర్వాత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విచారణ జరిపించారు. ఈ విచారణ నివేదక ప్రకారం తాజాతా ఏడుగురు ఇంజనీర్లను సస్పెండ్ చేశారు. అదేవిధంగా నిర్మాణ సంస్థను, డిజైన్ కన్సల్టెంట్‌ను బ్లాక్ లిస్ట్‌లో కూడా పెట్టారు. ఈ సంఘటన తర్వాత ఇటు ప్లీడ్ల్యూడీ, అటు రైల్వే శాఖ దేనికి దానికే సమర్ధించుకుంటున్నాయి. కానీ మొత్తం ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల రూ. 18కోట్లు నష్టం వచ్చింది.