Earthquake in Assam: ఈశాన్య భారతాన్ని వణికించిన భూకంపం

Earthquake in Assam: అస్సాంలోని గౌహతితోపాటు.. పలు ఈశాన్య రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది.

Update: 2021-04-28 07:16 GMT

భూకంపం (ఫైల్ ఇమేజ్)

Earthquake in Assam: ఈశాన్య భారతదేశాన్ని భూకంపం తీవ్రంగా వణికించింది. అస్సాంలోని గౌహతితోపాటు...ఉత్తర బెంగాల్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. కూచ్‌ బెహార్‌, మాల్దా, జల్పాయిగురి, సిలిగురి, ముర్షిదాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత మరో రెండు సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 7.51 గంటల ప్రాంతంలో సోనిత్‌పూర్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 6.4 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. ఆ తర్వాత 8.13 గంటలకు.. 08.34 గంటలకు మూడోసారి సైతం ప్రకంపనలు వచ్చాయని వెల్లడించింది.

భూపంక కేంద్రాన్ని తేజ్‌పూర్‌కు పశ్చిమ నైరుతి దిశలో 43 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భారీగా వచ్చిన ప్రకంపనలతో భవనాలు, గొడలు సైతం దెబ్బతిన్నాయి. వరుసగా మూడుసార్లు ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపంతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు వెల్లడించారు. 
Tags:    

Similar News